టీఆర్‌ఎస్‌తో పొత్తుకు పాకులాడిందెవరు?

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య

చంద్రబాబు ప్రతిసారీ కేసీఆర్‌ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారు

ఏపీ ఎన్నికలకు కేసీఆర్‌కు ఏం సంబంధం?

హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా పొత్తుకు తహతహలాడిందెవరు?

వైయస్‌ఆర్‌ జిల్లా: టీఆర్‌ఎస్‌తో పొత్తుకు పాకులాడిందెవరని, బావమరిది శవం పక్కన కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడింది చంద్రబాబు కాదా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య ప్రశ్నించారు. చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాలను పాటించడకుండా విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఏది న్యాయమో? ఏది అన్యాయమో చంద్రబాబు డిసైడ్‌ చేయడం ఏంటని ఆయన నిలదీశారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లాలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.  రాజ్యాంగాన్ని ఏమైనా చేస్తామని చంద్రబాబు ఒంటెద్దు పోకడలకు పోవడం సరికాదన్నారు. కేసీఆర్‌కు ఏపీ రాజకీయాలకు సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ఆ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తూ మళ్లీ సీఎంగా ఎన్నికైన వ్యక్తి కేసీఆర్‌ అన్నారు. మంచి పరిపాలన దక్షితుడిగా పేరుగాంచారన్నారు. ఆయన పేరు ఎందుకు చంద్రబాబు ప్రస్తావిస్తున్నారని తప్పుపట్టారు. మోకాలికి, బోడిగుండుకు సంబంధం ఏంటుందని ప్రశ్నించారు.

వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం చేసి ఓట్లతో లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు రాజకీయమన్నారు. తన బావమరిది హరికృష్ణ శవం పక్కనే కేటీఆర్‌తో ఎన్నికల పొత్తు గురించి మాట్లాడిన నీచమైన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు ఏం చేసినా అది మంచి..ఇతరులు చేస్తే చెడ్డనా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంతగా దిగజారుతారని ఎప్పుడు అనుకోలేదన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని, అటువంటి వాతావరణం కలిగించాలన్నారు. కానీ చంద్రబాబు కొంత మంది అధికారులను రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. అందుకే ఎన్నికల కమిషన్‌ అలాంటి అధికారులను పక్కన పెట్టిందన్నారు. కానీ చంద్రబాబు చేసిన పని ఏంటని ప్రశ్నించారు. ఈసీ  ఇచ్చిన జీవోలో ఇంటలీజెన్సీ డీజీ లేడని చంద్రబాబు అర్డర్స్‌ ఇవ్వడం దుర్మార్గమన్నారు. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయవచ్చు కానీ, అన్ని చంద్రబాబే చెప్పడం సరికాదన్నారు. ఏదీ అన్యాయమో? ఏది న్యాయమో చంద్రబాబు నిర్ణయించడం ఏంటని ప్రశ్నించారు.
 

Back to Top