సీబీఐకి సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు 

హైకోర్ట్ ఇచ్చిన ఈ తీర్పు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు

 సోషల్ మీడియా నియంత్రణకు కమిటీ అంటూ సీఎం రంకెలు

ఇది చేతకాని సన్నాసి ప్రభుత్వం

మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఫైయిల్

అయినా తాను గొప్ప విజనరీని అంటూ అసెంబ్లీలో చంద్రబాబు గొప్పలు

వెన్నుపోటుతో రాజకీయాల్లో ఎలా ఎదగాలో చెప్పిన చంద్రబాబు

ఎలా ప్రజాధనంను దోచుకుని జైలుకు వెళ్ళి రావాలో చెప్పుకోవాలి

మాజీ మంత్రి జోగి రమేష్ ధ్వజం

 చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల పవన్ స్పందించాలి

 మంత్రి దుర్గేష్‌పై మాట్లాడిన మాటలను సమర్థిస్తారా?

 కామినేని శ్రీనివాస్‌పై నోరుపారేసుకుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది?

 ప్రశ్నించిన మాజీ మంత్రి జోగి రమేష్

తాడేపల్లి:ప్రజల గొంతును వినిపించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... హైకోర్ట్ జారీ చేసిన ఈ ఆదేశాలను వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోందని అన్నారు. ఒకవైపు కోర్ట్‌లు ఈ ప్రభుత్వ దుర్మార్గాలపై మొట్టికాయలు వేస్తున్నా, సీఎం చంద్రబాబు సిగ్గు లేకుండా సోషల్ మీడియా నియంత్రణ కోసం అంటూ కమిటీ వేసేందుకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభ సాక్షిగా తాను గొప్ప విజనరీని అని చెప్పుకున్న చంద్రబాబు, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాపై ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో కూడా చెప్పాలని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాడనే అక్కసుతోనే సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్రారెడ్డిపై చట్టాలను అపహాస్యం చేస్తూ గంజాయి కేసు పెట్టారు. ఈ అక్రమ అరెస్ట్‌పై ఆయన కుటుంబం కోర్ట్‌ను ఆశ్రయించడంతో పోలీసుల నిర్వాకం న్యాయస్థానంలో బట్టబయలు అయ్యింది. ఈ మొత్తం వ్యవహారంపై వచ్చేనెల పదమూడో తేదీ లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్ట్ ఆదేశించింది. ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే వారి పట్ల అత్యంత దుర్మార్గంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటువంటి నిరంకుశ విధానాలు, చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షించేలా ఉన్నాయి. 

-   దోచుకోవడంపై చంద్రబాబు సభలో ప్రజెంటేషన్ 

ఏడాదిన్న కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు చేశామో చెప్పుకోలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దొంగతనం ఎలా చేయాలి, పట్టుబడకుండా ఎలా వ్యవహరించాలి, మోసం ఎలా చేయాలి, వెన్నుపోటు ఎలా పొడవాలి, తరువాత దానిని ఎలా సమర్థించుకోవాలి అనే విషయంలో శాసనసభ్యులు, స్పీకర్‌కు సీఎం చంద్రబాబు చాలా గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో రూ.371 కోట్లు స్కిల్ స్కాంలో ఇదే చంద్రబాబు సీఎంగా దోచుకుని అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయి, జైలుకు సైతం వెళ్ళాడు. మరోవైపు ఆయన తాబేదారు నోటుకు కోట్లు కేసులో రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దోరికిపోయాడు. అదే సమయంలో చంద్రబాబు ఫోన్ సంభాషణలో ఇదే కేసులో దొరికిపోయాడు. అలాగే తనకు ఉన్న అధికార కాంక్షతో, పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఇటువంటివి ఎలా చేయాలో అసెంబ్లీలో చంద్రబాబు చాలా ఘనంగా చెప్పుకున్నాడు. గత ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో అన్ని ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఆయనను అరెస్ట్ చేయడం తప్పు అని చంద్రబాబు మాట్లాడాడు. చింతమనేని ప్రభాకర్ ప్రజలపై రౌడీయిజం చేస్తూ, ప్రభుత్వ మహిళా అధికారిణిపై దౌర్జన్యం చేస్తే, ఆయనపై ఉన్న కేసులను చంద్రబాబు వ్యతిరేకిస్తారు. చిత్తూరు అంగళ్ళు ఘటనలో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు తీసి, పోలీసులపైనే తిరగబడమని తన అనుచరులను ఉసిగొల్పి దాడులు చేయించాడు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి కన్నుకూడా పోయింది. ఈ విషయాలన్నీ చంద్రబాబు మరిచిపోయారా? అసెంబ్లీలో తాను గొప్ప సచ్చీలత ఉన్న నాయకుడుగా సమర్థించుకుంటూ మాట్లాడాడు. 

-   వైయస్ జగన్ చూసి భయపడుతున్నారు

చంద్రబాబుకు నిత్యం వైయస్ జగన్ పేరు స్మరించనిదే నిద్రపట్టదు. ఎక్కడ మళ్ళీ సీఎం అవుతాడేమోననే భయంతో వణికిపోతున్నాడు. ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న నాయకుడుగా ఉన్న నేత వైయస్ జగన్. వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడానికే భయపడుతున్నారు. చివరికి వైయస్ జగన్ ప్రజల్లోకి వెడుతున్నా సరే అనేక ఆంక్షలు పెట్టి, అడుగుడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్భాగ్యమైన పాలన అవసరమా? సోషల్ మీడియాపై నియంత్రణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై పెడుతున్న తప్పుడు కేసులపై హైకోర్ట్, సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసినా సీఎం చంద్రబాబుకు సిగ్గులేదు. భావప్రకటన స్వేచ్ఛను హరించేలా రాష్ట్రంలో పాలన సాగుతోంది. తన అసమర్థతను బయటపెడుతున్నారనే కక్షతోనే సోషల్ మీడియాను నియంత్రించే చట్టాలు చేసేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధర లేని పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నిస్తుంటే, దానిని పరిష్కరించకుండా అలా ప్రశ్నిస్తున్నవారిపైనే చర్యలకు సిద్దమయ్యారు. బీఎన్‌ఎస్ సెక్షన్లు పెట్టి, వారిని అక్రమంగా అరెస్ట్ చేసి, జైళ్ళపాలు చేయాలని కుట్రకు తెగబడ్డారు. 
 
-   ప్రశ్నించే గొంతులను నొక్కాలనుకోవడం అవివేకం

వైయస్ జగన్ హయాంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి, అయిదు కాలేజీలను ప్రారంభించారు. మిగిలిన వారిని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటే, ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కాలేజీలను తనకు కావాల్సిన వారికి అమ్ముకునేందుకు సిద్దమైంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో నియంత్రణ అంటూ కమిటీలు వేస్తున్నారు. ఇది చేతకాని, సన్నాసి ప్రభుత్వం కాదా? చేస్తున్న తప్పుడు పనులపై సిగ్గులేకుండా అసెంబ్లీలో చర్చ పెట్టడం, నియంత్రణ అంటూ ఒక కమిటీని వేశారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో, వైద్యం అందక ఎంతో మంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, విద్యార్ధులను కాలేజీ యాజమాన్యాలు వేధిస్తున్నాయి. దీనిని సోషల్ మీడియా ప్రశ్నిస్తుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇటువంటి బెదరింపులతో ప్రజాగ్రహాన్ని అడ్డుకోలేరు. సోషల్ మీడియాను అణిచివేయాలనుకుంటే, రెట్టింపు వేగంతో ముందుకు వస్తుంది. చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ కార్యాలయంలో పెయిడ్ సోషల్ మీడియాను నడిపిస్తూ వైయస్ఆర్‌సీపీపై నిత్యం విషం చిమ్ముతున్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక హైకోర్ట్‌ సోషల్ మీడియా విషయంలో ఇచ్చిన ఆదేశాలను వక్రీకరిస్తూ, అసెంబ్లీలో చంద్రబాబు కొత్త అర్థాలు చెబుతున్నారు. ఏపీలోనూ సోషల్ మీడియాను నియంత్రిస్తానంటూ రంకెలు వేస్తున్నాడు. 

-  సైకోలను అసెంబ్లీకి పంపామని ప్రజలు బాధపడుతున్నారు

చంద్రబాబు బాటలోనే నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నడుస్తున్నాడు. అసెంబ్లీలో సైకోలుగా మారి మాట్లాడుతున్న వీరిని చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఇలాంటి సైకోలనా మేం అసెంబ్లీకి పంపాం అని బాధపడుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయ వారసుడిని అని చెప్పుకునే అర్హత బాలకృష్ణకు లేదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఎందుకు రాజకీయ వారసుడుగా బాలకృష్ణ నిలబడలేదు, నారా చంద్రబాబు ఎలా అయ్యాడు? ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టిస్తే, అదే చంద్రబాబు పంచన చేరి, వైయస్ జగన్ వంటి ప్రజానాయకుడి గురించి పిచ్చిపట్టినట్లు మాట్లాడాడు. అలాగే కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవిని గురించి నిండు సభలో వాడు, వీడు అంటూ కనీస మర్యాద కూడా లేకుండా దూషించాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? తన అన్నను అసెంబ్లీలో కించపరిచేలా మాట్లాడితే చీమకుట్టినట్లు కూడా అనిపించడం లేదా? చివరికి ఇతర దేశాల్లో ఉన్న చిరంజీవి దీనిపై స్పందించారు. వైయస్ జగన్ గారు సీఎంగా తనకు సముచిత గౌరవం ఇచ్చారు, భోజనం పెట్టి పంపారు అని చెప్పారు. ఆ రోజు వైయస్ జగన్ గారిని కలిసిన ఇతర సినిమా ప్రముఖులను అడిగితే నిజం తెలుస్తుంది.  తన అన్న మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా పవన్ దీనిపై ప్రశ్నించాలి? జనసేన కు చెందిన మంత్రి దుర్గేష్‌ను కూడా కించపరిచేలా బాలకృష్ణ మాట్లాడినా కూడా చీమూ, నెత్తురు లేని వారిలా మౌనంగా ఉంటారా? బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావును పచ్చిబూతులు తిట్టినా, బీజేపీ నాయకులు ఎవరూ స్పందించలేదు.

Back to Top