కాన్వాయ్ ఆపిమరీ.. వినతి పత్రాలు తీసుకున్న సీఎం వైయ‌స్ జగన్   

విశాఖ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు మాన‌వ‌త్వాన్ని చూపారు.  విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు సూర్య, రాశి దంపతులను ఆశీర్వ‌దించేందుకు కాన్వాయ్‌లో వెళ్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. ప‌క్క‌న వేచి చూస్తున్న వారిని గ‌మ‌నించి ఆగాడు. ఏకంగా కాన్వాయ్ ఆపేసి..కింద‌కు దిగి త‌న కోసం ఎదురుచూస్తున్న వారిని దగ్గ‌ర‌కు పిలిచి వారి నుంచి విన‌తిప‌త్రాన్ని తీసుకున్నారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని ప‌క్క‌నే ఉన్న అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎదురొచ్చి త‌న స‌మ‌స్య‌ను తెలుసుకొని, విన‌తిప‌త్రం తీసుకోవ‌డం ప‌ట్ల బాధితులు ఆనందం, సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  

Back to Top