వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి

సీఎం వైయ‌స్ జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని ఇంటింటికి వివరించండి

వైయ‌స్ జ‌గ‌న్‌ రాకపోతే కలిగే నష్టాన్ని ప్రజలకు తెలియచెప్పండి
 
నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండలో ఉత్తమ వలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులు ప్రధానం

 అనంత‌పురం: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తోందని, వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ సచివాలయం-1 పరిధిలో వరసగా నాలుగో ఏడాది నిర్వహించిన వాలంటీర్లకు అభినందన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వరుసగా నాలుగో ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెల కట్టలేనివని అన్నారు. వాలంటీర్లు అంటే జగనన్న సైనికులు అని, కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎంతో విశేష సేవలు చేశారని తెలిపారు. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులగా పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటివద్దకే సేవలు ఇలాగే అందాలంటే..వలంటీర్ల వ్యవస్థ కొనసాగలంటే వైయ‌స్ జగనే మళ్ళీ సీఎం కావాలన్నారు.

వైయ‌స్ జగన్ లేకపోతే ఈ వ్యవస్థ ఉండదు. ప్రజలకు ఈ సేవలు అందవని చెప్పారు. అందుకే మరోసారి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆదిశగా వలంటీర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సేవావజ్ర పురస్కారాలకు భువనేశ్వరి, రాజశేఖర్, సేవారత్న పొందిన సురేఖ, లావణ్య, కృష్ణ ప్రసాద్, శ్రీ లక్ష్మీ, రంగమ్మలకు సర్టిఫికెేట్‌, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో పాటు నగదును విశ్వేశ్వరరెడ్డి ప్రదానం చేశారు. ఈ అవార్డు మీ పై మరింత బాధ్యత పెంచుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత, ఎంపీపీ నరసింహులు, జెడ్పిటిసి పార్వతమ్మ, ఉప సర్పంచ్ వన్నప్ప, మాజీ ఎంపీపీ చంద్రమ్మ, ఎంపీడీఓ అమృత్ రాజ్, ఈఓఆర్డీ చంద్రమౌళి, ఈఓ గౌస్, వార్డు సభ్యులు వాసు, ఎంపిటిసి హోన్నూరు సాబ్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీరం బాషా, నాయకులు ఏసీ ఎర్రిస్వామి, ఓబన్న, ఆసిఫ్, పచ్చి రవి, చిన్న భీమ, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Back to Top