అమరావతి: నిబద్ధతకు,విలువలకు ఏపీ ప్రజలు పట్టం కట్టారని వైయస్‌ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు తనకు కావాల్సిన పనులను చక్కదిద్దుకున్నారే తప్ప ప్రత్యేకహోదా,ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎన్నో సార్లు ప్రశ్నించిన టీడీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంపీలందరూ రాజీనామా చేశారన్నారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రత్యేకహోదాపై యూటర్న్ తీసుకున్నారని తెలిపారు.చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారన్నారు.వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని భరోసా ఇచ్చే నాయకుడిగా ప్రజలందరూ భావించి ఆయనకు పట్టం కట్టారని తెలిపారు. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 14 నెలల పాటు వైయస్ జగన్ పాదయాత్ర చేశారన్నారు.కోట్లాది మంది ప్రజలను కలిసి భరోసా ఇచ్చారన్నారు.ఈ విజయం ప్రభంజనం లాంటిందని తెలిపారు.నిబద్ధత కలిగిన వైయస్ జగన్‌కు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు.నైతిక విలువలు పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకుడిని ప్రజలు కోరుకున్నారని తెలిపారు.