తాడేపల్లి: పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్, వైయస్‌ఆర్ డిజిటల్ లైబ్రరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అమూల్ పాల సేకరణ చేస్తున్న జిల్లాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.