రేపు సంత‌బొమ్మాళిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

మూల‌పేట గ్రీన్‌ఫీల్డ్‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సంత‌బొమ్మాళి మండ‌లం మూల‌పేట‌లో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. 19వ తేదీ ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు మూలపేట చేరుకుంటారు. 10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంత‌రం గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. 11.25 – 11.35 గంటల మధ్య నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేయ‌నున్నారు. అనంత‌రం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11.40 – 12.30 గంటల మధ్య బహిరంగ సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top