కార్మికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టం సంతోషాన్నిచ్చింది

కార్మికుల‌ను ర‌క్షించిన రెస్క్యూ టీమ్‌కి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినంద‌న‌లు

తాడేపల్లి: ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘టన్నెల్ ఆపరేషన్‌లో రెస్క్యూ టీమ్‌ అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీమ్‌కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి. మొత్తం 41 మంది కార్మికులు సొరంగం నుంచి సురక్షితంగా బయటపడటం సంతోషాన్నిచ్చింది’’ అంటూ సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top