త‌ల‌రాత‌ను మార్చే శ‌క్తి చదువుకు మాత్రమే ఉంది

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: మ‌నిషి త‌ల‌రాత‌ను, కుటుంబం త‌ల‌రాత‌ను మార్చే శ‌క్తి చ‌దువుకు మాత్రమే ఉంద‌ని అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. నేడు జ‌గ‌న‌న్న విద్యా దీవెన నిధుల విడుద‌ల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

``చీకటి నుంచి వెలుగులోకి ఏ మనిషినైనా నడిపించేది చదువు. మనిషి తలరాతనుగానీ, కుటుంబం తలరాతనుగానీ మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. అలాంటి చదువుకు పేదరికం అడ్డుకాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఇస్తున్నాం``. 

``ఈరోజు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షలమంది విద్యార్థులకు మేలుచేస్తూ రూ.698.68 కోట్లను ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నాను`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top