యోగి వేమ‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: యోగి వేమన జయంతి సందర్భంగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19న అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ఇటీవల జీవో జారీ చేసింది. 

Back to Top