అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం కాన్వాయ్‌

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారిచ్చింది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద మహానేతకు నివాళులర్పించిన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. మార్గమధ్యలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న  అంబులెన్స్‌కు దారిచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top