ముస్లిం సోదరులకు సీఎం వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

తాడేపల్లి: మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, సామరస్యత, సోదరభావం పెంపొందించుకోవాలన్న ప్రవక్త బోధనలు మానవాళి ధర్మమార్గంలో నడిచేందుకు స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
 

Back to Top