అమితాబ్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

అమరావతి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం పట్ల ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికైనందుకు అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు చెబుతున్నట్టు సీఎం ట్వీట్ చేశారు. భారతీయ సినిమా రంగానికి ఆయన అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. సరైన వ్యక్తినే ఈ పురస్కారం వరించిందని, యావత్ చిత్రపరిశ్రమ గర్వించదగ్గ క్షణాలు అంటూ తన ట్వీట్ లో వివరించారు.

Back to Top