నేడు క‌ర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం ప‌ర్య‌ట‌న‌

క‌ర్నూలు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం వైయ‌స్‌ జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైయ‌స్‌ జగన్ కృష్ణగిరి మండలం ఆలంకొండకు వెళ్లనున్నారు. అక్కడ పంప్ హౌస్‌లో హంద్రీనీవా నీటిని చెరువులకు ఎత్తిపోసే మోటార్లను స్విచ్‌ ఆన్ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా డోన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. 

Back to Top