రేపు విజయనగరం జిల్లాకు సీఎం వైయస్‌ జగన్‌

గుంకలాంలో పేద‌ల‌కు ఇళ్ల పట్టాల పంపిణీ చేయ‌నున్న సీఎం 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా తొలి విడత ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి 11:15 గంటలకు గుంకలాం చేరుకోనున్నారు. గుంకలాం చేరుకున్న అనంతరం `న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు` పైలాన్‌ ఆవిష్కరిస్తారు. అనంతరం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

Back to Top