కాసేప‌ట్లో న‌ర‌స‌రావుపేట‌లో గోపూజ మ‌హోత్స‌వం

 గోపూజ మహోత్సవంలో పాల్గొన‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
 

 
తాడేప‌ల్లి: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో  జరిగే గోపూజ మహోత్సవంలో కాసేప‌ట్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకోనున్నారు. మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొనున్నారు మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం వైయ‌స్ జగన్‌ తాడేపల్లి చేరుకోనున్నారు.

Back to Top