రేపు గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

నాలుగో ఏడాది మూడో విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్,  ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం (28.02.2023) గుంటూరు జిల్లా తెనాలిలో ప‌ర్య‌టించ‌నున్నారు. నాలుగో ఏడాది మూడో విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి పాల్గొన‌నున్నారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం విడుద‌ల చేసింది

మంగ‌ళ‌వారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుని నాలుగో ఏడాది మూడో విడత వైయ‌స్ఆర్‌  రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top