15న క‌ర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎల్లుండి (15.02.2024) కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి  సీఎం హాజ‌రుకానున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. 
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు. అక్కడ బళ్ళారి రోడ్‌లోని ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేపూడిలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top