ప్రజల పట్ల మ‌న‌వతా దృక్పథంతో ఉండాలి

జిల్లా క‌లెక్ట‌ర్లు, అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

`స్పంద‌న‌`పై సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్ ప్రారంభం

తాడేపల్లి: ప్రజల పట్ల మానవీయ దృక్పథంతో ఉండాలని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలని, పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్పంద‌న‌పై స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సీఎం జగన్‌ మొదటిసారిగా స్పందన కార్యక్రమం చేపట్టారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి 26 జిల్లాల క‌లెక్టర్లు, ఎస్పీల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, వైయ‌స్ఆర్‌ జగనన్న భూహక్కు-భూ రక్ష, విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడుపై జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. 

Back to Top