‘స్పందన’పై సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ‘స్పందన’ కార్యక్రమంపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సమీక్షించనున్నారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌పై చర్చించనున్నారు. ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు భూ బదలాయింపులపై, కోవిడ్, సీజనల్‌ వ్యాధుల నివారణపై అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా దిశా యాప్‌ డౌన్‌లోడ్‌పై ప్రజల్లో అవగాహనపై చర్చించనున్నారు. వ్యవసాయ రంగం, ఆర్బీకేలు, గ్రామ పట్టణ హెల్త్‌ క్లినిక్స్‌పై సమీక్షించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొనసాగుతున్న తనిఖీలపై సీఎం చర్చించనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top