

















వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అప్పు తప్ప అభివృద్ధి ఏమీ లేదని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం కడప నగరంలో జగన్ అంటే నమ్మకం... చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని పార్టీ నేతలతో కలిసి అవినాష్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..`పొదిలికి వైయస్ జగన్ వెళ్తే వైయస్ఆర్‌సీపీ నేతలపై రాళ్లు వేయించి.. తిరిగి వారిపై కేసులు పెట్టారు. పోలీసుల వేధింపులతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. 31 లక్షల మంది లబ్ధిదారులకు కోత విధించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారు` అని అవినాష్‌రెడ్డి ఆక్షేపించారు.