కొండపల్లి మున్సిపల్ ఎన్నిక ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో నిర్వహించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా : ప్రజాస్వామ్య పద్ధతిలో తిరిగి కొండపల్లి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ డిమాండ్ చేశారు. కొండపల్లి మున్సిపల్ ఎన్నిక ప్రకటనపై ఆయ‌న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపాలిటీలో నైతిక విజయం వైయ‌స్ఆర్‌సీపీదే అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అప్రజాస్వామ్య పద్ధతి తెలుగుదేశం కూట‌మి గెలిచింద‌ని ఆక్షేపించారు. సంవత్సర కాలంలో కూట‌మి పాల‌న‌పై రాష్ట్రంలో తీవ్ర  ప్రజా వ్యతిరేకత వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. తీరు మార్చుకోక‌పోతే ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు.

Back to Top