జ‌న‌సేన‌కు షాక్‌!

చిల‌కలూరిపేట‌లో 20 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక 

ప‌ల్నాడు : జ‌న‌సేన పార్టీకి ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో భారీ షాక్ త‌గిలింది. కూట‌మి ప్ర‌భుత్వ‌తీరుపై విసుగుచెందిన 20 కుటుంబాలు జ‌న‌సేన పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరాయి. చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరం గ్రామంలో జనసేన కు చెందిన 20 కుటుంబాలు మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని సమక్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  లో చేరారు.  గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి సాయి, కామిరెడ్డి గోపీనాథ్, ఆవుల ఫణీంద్ర, నరేంద్ర, షేక్ రషీద్, శివ, ఆవుల దేవ, శ్రీనివాసరావు, కరిముల్లా, షేక్ హబీబుల్లా, ముజీబ్, షేక్ జాన్ సైదా , షేక్ అమీర్ తో పాటు మరికొందరు జనసేనను వీడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని సాదరంగా వారిని పార్టీ లోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కెల్లంపల్లి సుందరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి వలేటి వెంకటేశ్వర రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాట్రు రమేష్, కౌన్సిలర్లు తులం సుధాకర్, షేక్ ఆదంవలి, పిల్లి సాగర్ బాబు, నాలుగోవార్డు ఇన్చార్జి కాటా వెంకటేశ్వర్లు, మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ ఛైర్మన్ బొప్పూడి రామారావు ,ఆముదాలపల్లి అంజి మరియు పలువురు వైయ‌స్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top