

















మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
కర్నూలు: ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడిచింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని, చంద్రబాబుది ఆది నుంచి వెన్నుపోటు రాజకీయమేనని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. బిడ్డను ఇచ్చిన మామా ఎన్టీఆర్ ను అధికారం కోసం వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. సోమవారం జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు రాజకీయం, తన స్వప్రయోజనాల కోసం ఎన్డీయే కూటమితో ఒకసారి. యూపీఏ కూటమితో మరోసారి జతకట్టి ప్రజలను వెన్నుపోటు పోడిచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, చంద్రబాబు తన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అశాంతి, అరాచకం, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, అన్యాయం చేస్తున్నారు. అబద్దాలతో చట్టాన్ని ఉల్లంఘించడంతో లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో క్షీణించింది. వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ నమ్మకం, భరోసా ఉండేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయి` అని బాలనాగిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, మంత్రాలయం, కోసిగి, పెద్ద కడుబూరు, కౌతాళం మండల కన్వీనర్లు బీమారెడ్డి, బెట్టనగౌడ, రాంమోహన్ రెడ్డి,ప్రహ్లాద చార్, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు నాగరాజు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు ఎకాంబ రెడ్డి, మాబ్ సాబ్, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రఘురాం, గజేంద్ర రెడ్డి,మాజీ ఆర్లబండ సహాకార సంఘం అధ్యక్షులు మహాంతేష్ స్వామి,కామన్ దొడ్డి నరసింహులు,దొడ్డి నర్సన్న, యంపిపి అమరేష్, బుజ్జి స్వామి, రాజశేఖర రెడ్డి, శివరాం రెడ్డి,బసిరెడ్డి, మల్లికార్జున గౌడ్, ఈరన్న, చూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.