కాసేపట్లో జిల్లా కలెక్టర్లతో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వీడియో కాన్ఫ‌రెన్స్

తాడేప‌ల్లి:  కాసేపట్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ కలెక్టర్లకు తగు సూచనలు చేయనున్నారు. మరోవైపు తుపాన్ వల్ల వాటిల్లిన నష్టంపై కేంద్రం బృందం ఓ అంచనాకు వచ్చింది. నాలుగు జిల్లాల్లో గత మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించింది. సీఎం వైయ‌స్ జగన్ తో కేంద్ర బృందం భేటీ కానుంది. ఇంకోవైపు తక్షణ సాయంగా వెయ్యి కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్రాన్నివైయ‌స్ జగన్ ఇప్పటికే కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top