పశ్చిమ గోదావరి: పోలవరం పర్యటనలో భాగంగా సీఎం వైయస్ జగన్, కేంద్ర మంత్రి షెకావత్ కొద్దిసేపటి క్రితమే ఇందుకూరు పేటకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఇవాళ పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి సీఎం వైయస్ జగన్ పోలవరం పర్యటనకు బయల్దేరారు. ఇందుకూరు నిర్వాసితులతో సీఎం వైయస్ జగన్, కేంద్రమంత్రి షెకావత్ ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందుకూరు పేట చేరుకున్న సీఎం వైయస్ జగన్, కేంద్ర మంత్రి షెకావత్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు నిర్వాసితుల పునరావాస కాలనీ పరిశీలిస్తారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.