నాడు నేడూ నా యాత్ర ప్ర‌జ‌ల కోస‌మే..

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు నాలుగేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ చేసిన ``ప్రజాసంకల్ప యాత్ర`` నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. దివంగత మహానేత వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశీస్సుల‌తో ఇడుపులపాయలో వైయ‌స్ఆర్ ఘాట్ వ‌ద్ద 2017 నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. ప్ర‌జ‌ల‌కు ఒక న‌మ్మ‌క‌మై.. ఒక భ‌రోసాగా నిలిచిన పాద‌యాత్ర‌కు నేటితో నాలుగేళ్లు. 

ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``ప్రజాసంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోంది`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top