తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘బడుగు, బలహీనవర్గాలు, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. మహిళల విద్యావికాసానికి, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. సమసమాజ స్థాపనకు బాటలు వేసిన పూలే గారి ఆశయాలే స్ఫూర్తిగా ముందుకు సాగుదాం’ అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. Read Also: జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం