సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేడ్కర్‌

నేడు ఆయన జయంతి సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ 

తాడేప‌ల్లి: నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. బీఆర్ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌ చేశారు. ‘భారత సమాజానికి అత్యుత్తమమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేడ్కర్‌. బుధవారం భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.     

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top