విక్ర‌మ్‌ను దీవించిన ఆత్మ‌కూరు ప్ర‌జానీకానికి ధ‌న్య‌వాదాలు

మంచి చేస్తున్న ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల దీవెన‌లే శ్రీ‌రామ‌ర‌క్ష‌

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: ఉప ఎన్నిక‌లో మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డికి ఘ‌న విజ‌యాన్ని అందించిన ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ``ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా.. ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్ర‌మ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. పేరుపేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top