గ‌వ‌ర్న‌ర్‌ను ప‌రామ‌ర్శించిన‌ సీఎం వైయస్‌ జగన్‌

సచివాలయం: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ గవర్నర్‌కు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌.. గ‌త‌ రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా కరోనా లక్షణాలు కనిపించాయి. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో గ‌వ‌ర్న‌ర్ చికిత్స పొందుతున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top