మార్కాపురం బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌కాశం జిల్లా మార్కాపురం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి హెలికాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేరి వెళ్లారు. మ‌రికొద్దిసేప‌ట్లో మార్కాపురం చేరుకోనున్నారు. మార్కాపురంలోని ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స‌భా వేదిక వ‌ద్ద‌కు చేరుకొని వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేస్తారు. అనంత‌రం బహిరంగ సభలో ప్రసంగించ‌నున్నారు. ప్ర‌సంగం అనంత‌రం అక్క‌చెల్లెమ్మ‌ల ఖాతాల్లో వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం న‌గ‌దును జ‌మ చేయ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు.

Back to Top