పేద‌ల బ‌తుకులు మార్చేందుకే `మ‌ద్యం పాల‌సీ` 

  విడ‌త‌లవారీగా మ‌ద్య నియంత్ర‌ణ చేస్తాం

 నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా వెన‌కాడం 

 ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

మేం అధికారంలోకి వ‌చ్చాక ఎక్సైజ్ పాల‌సీ 2019-20ని అక్టోబ‌ర్ 1న‌ ప్రారంభించాం. గ‌త ప్ర‌భుత్వం నెల‌నెల‌కీ సేల్స్ పెంచాల‌ని టార్గెట్‌గా పెట్టుకుని ప‌నిచేసేవారు. అందుకు ఉద్యోగుల‌కు ఇన్సెంటీవ్స్ ఇచ్చేవారు. ప్ర‌భుత్వ‌మే ద‌గ్గరుండి ప్రోత్స‌హించింది. సేల్స్ పెంచుకోవ‌డం కోసం గ్రామాల్లో విచ్చ‌ల‌విడిగా బెల్టు షాపులు పెట్టి మ‌ద్యం అమ్మ‌కాలు చేప‌ట్టారు. కానీ మేం అధికారంలోకి వ‌చ్చాక 43 వేల బెల్టు షాపులు ర‌ద్దు చేశాం. ఈ విష‌యం చెప్పుకోవ‌డానికి మేం గ‌ర్వ‌ప‌డుతున్నాం. అధికారంలోకి వ‌చ్చిన నెల త‌ర్వాత అన‌గా జూలై నాటికి కూడా మ‌ద్యం దుకాణాలు ఎన్ని ఉన్నాయో లెక్క‌లు తెప్పిస్తే 4380 ఉన్నాయ్‌. ఇప్పుడు చూస్తే 3456 షాపులు మాత్ర‌మే ఉన్నాయి. అంటే దాదాపు 25% షాపులను నియంత్రించాం. రాష్ట్ర‌వ్యాప్తంగా 840గా ఉన్న‌ బార్ల‌ను (40 శాతం) 487కి త‌గ్గించాం. దీనికి నోటిఫికేష‌న్ ఇచ్చాం. మ‌ద్యం దుకాణాల‌కు ప‌ర్మిట్ రూములు లేకుండా చేశాం. మ‌ద్యం అమ్మ‌కం స‌మ‌యం త‌గ్గించాం. గ‌తంలో ఒక్కొక్క‌రికి 6 బాటిళ్లు వ‌ర‌కు అమ్మేవారు దానిని 3కి త‌గ్గించాం. లిక్క‌ర్ రేట్లు కూడా షాక్ కొట్టేలా పెంచేశాం. పాద‌యాత్ర‌లో చెప్పిన‌ట్టే చేశాం. ఈ విష‌యాన్ని చెప్పడానికి గ‌ర్వ‌ప‌డుతున్నా. ప్ర‌తి జిల్లాలో డీ అడిక్ష‌న్ సెంట‌ర్లు పెట్టాల‌ని మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట‌మెంట్ కి 25.9.2019న ఆదేశాలిచ్చాం. మ‌ద్యం వ్య‌స‌నం ప‌ర్య‌వసానాలు న‌ష్టాలు అనే అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చ‌మ‌ని విద్యాశాఖ‌ను 25.9.2019న ఆదేశించాం. ప్ర‌తి గ్రామంలో గ్రామ స‌చివాల‌యంలో మ‌హిళా పోలీసులు ఉన్నారు. వీరంతా అక్ర‌మంగా బెల్టు షాపులు అమ్మితే వెంట‌నే రిపోర్టు చేస్తారు. మ‌ద్య విమోచ‌న క‌మిటీని ఏర్పాటు చేశాం. దీనికి ల‌క్ష్మ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త వహిస్తారు. 

ప్ర‌తిప‌క్షం అస‌త్య ఆరోప‌ణలు చేస్తోంది
అక్ర‌మంగా అమ్మితే కేసులు న‌మోదు చేస్తున్నాం. అయినా ప్ర‌తిప‌క్షం అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తోంది. అలాంటి వారిని స‌భ‌లో ఉంచ‌డం కూడా త‌ప్పే. పాద‌యాత్ర‌లో నేను అన‌ని మాట‌లు అన్నాన‌ని ప్ర‌చారం చేసినందుకు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి మీద ప్రివిలైజ్ మోష‌న్ మూవ్ చేస్తున్నా. పాద‌యాత్ర‌లో వేర్వేరు వ‌ర్గాలతో ముఖాముఖి కార్యక్ర‌మాలు నిర్వ‌హించాం. అందులోనే మ‌ద్య నియంత్ర‌ణ విడ‌త‌ల వారీగా చేస్తామ‌ని చెప్పాం. అదే విష‌యాన్నే మేనిఫెస్టోలో పెట్టాం. మేం చెప్పిన మాట‌ల్లో ఏదైనా త‌ప్పుంద‌ని నిరూపించ‌లేక‌పోతే చంద్ర‌బాబు రాజీనామా చేస్తారా అని డిమాండ్ చేస్తున్నా. 

మ‌ద్యం పాల‌సీ
అక్ర‌మంగా మ‌ద్యం విక్రయించినా, స‌ర‌ఫ‌రా చేసిన క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తున్నాం. వారికి 6 నెల‌ల జైలు శిక్ష‌తోపాటు 2 ల‌క్షల‌ రూపాయ‌ల జ‌రిమానా విధిస్తాం. రెండోసారీ ప‌ట్టుబ‌డితే 5 ల‌క్ష‌ల జ‌రిమానాతోపాటు ఆరు నెల‌ల జైలు శిక్ష‌. నాన్‌బెయిల‌బుల్ కేసులు విధిస్తాం. బార్ య‌జ‌మానులు త‌ప్పు చేస్తే లైసెన్సులు రెండింత‌లు పెంచుతాం. మ‌ళ్లీ త‌ప్పు చేస్తే లైసెన్సులు ర‌ద్దు చేస్తాం. ఇదంతా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌వేశ‌పెట్టాం. 

గ‌త ప్ర‌భుత్వం, వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలో మ‌ద్యం విక్ర‌యాల 

ఐఎంఎల్ మ‌ద్యం
                         సెప్టెంబ‌ర్                      అక్టోబ‌ర్                     న‌వంబ‌ర్

2018                        34.20                        32.28                           29.62

2019                        22.26                         24.18                           22.62

త‌గ్గిన శాతం         34.29%                      25.11%                        23.63%

బీర్లు 
                        సెప్టెంబ‌ర్                       అక్టోబ‌ర్                         న‌వంబ‌ర్

2018                      22.19                          23.86                            17.80

2019                      16.46                         10.59                              8.15  

త‌గ్గిన శాతం        34.86%                      55.62%                          54.22%

Back to Top