‘భూహక్కు–భూరక్ష’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం అమలవుతున్న తీరును సంబంధిత మంత్రి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పలు కీలక ఆదేశాలిచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాద్‌ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి ఉషారాణి, సర్వే,సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌  సిద్దార్ధ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Back to Top