టెలీ మెడిసిన్‌ సరఫరాకు ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌

జూలై 1న 1,060 అంబులెన్స్‌లతో పాటు బైక్‌ సర్వీసులు కూడా ప్రారంభం

టెలీ మెడిసిన్, రైతు భరోసా కేంద్రాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: టెలీ మెడిసిన్‌ను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు డోర్‌ డెలివరీ చేసేందుకు బైక్‌లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. జూలై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. జూలై 1న 1,060 అంబులెన్స్‌లు ప్రారంభం రోజే బైక్‌ సర్వీసులు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.   

రైతు భరోసా కేంద్రాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం. రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించేనాటికి మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కోసం ఉద్దేశించిన యాప్‌ అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.  

 

తాజా వీడియోలు

Back to Top