కరోనా నియంత్రణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. కరోనా పరీక్షలు, ఇతర రాష్ట్రాలు, క్వారంటైన్‌లలో మౌలిక వసతులు, వలస కూలీలకు షెల్టర్‌ భోజన సదుపాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

Back to Top