కాళ్లవాపు వ్యాధి ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపు వ్యాధి ఘటనలపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి మళ్లీ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఉన్నతాధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని ఆదేశించారు. మళ్లీ ఈ కాళ్లవాపు వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్‌ నిధికే అప్పంగించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను తమ ప్రభుత్వం ఆదుకుంటోందని, ఇప్పుడు బదిలీ చేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారన్నారు. 
 

Back to Top