ఇళ్ల నిర్మాణం వేగం పెంచాలి

 గృహనిర్మాణశాఖపై స‌మీక్ష‌లో సీఎం  వైయస్ జగన్ 

తాడేప‌ల్లి: హౌసింగ్ కింద ఇళ్లనిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

  • గడిచిన అక్టోబరులో 7.43 లక్షల ఇళ్లను ఇప్పటికే అక్కచెల్లెమ్మలకు అందించామన్న అధికారులు. 
  • ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామన్న అధికారులు.
  • వీటికి సంబంధించిన పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని వెల్లడి.
  • అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు అక్టోబరులో లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై నిశితంగా పరిశీలన చేశామని వెల్లడి.
  • కరెంటు, తాగునీరు సదుపాయాలను కల్పించామని,  మాజిక్‌ సోక్‌ పిట్స్‌ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడి.
  • ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ జరపాలన్న సీఎం
  • ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
  • నిర్మాణాలు పూర్తిచేసుకున్న ప్రతి ఇంటినీ ఆడిట్‌ చేసి  సదుపాయాలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై ఆడిట్‌ నిర్వహించాలన్న సీఎం.
  • కరెంటు, తాగునీరు, సోక్‌ పిట్స్‌ ఉన్నాయా? లేవా? అన్నవాటిపై ఆడిట్‌ చేయించాలన్న సీఎం.
  •   ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటిరకూ 12,72,143 మంది అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు.
  • రూ.4,483 కోట్ల రుణాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు.
  • పావలా వడ్డీ  రుణాలపై చెల్లించాల్సిన మిగిలిన వడ్డీ భారాన్ని భరించనున్న ప్రభుత్వం.
  • ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశం.

టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సీఎం సమీక్ష.

  • టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.
  • లబ్ధిదారులతో ఏర్పాటుచేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలన్న సీఎం.
  • ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్నదానిపై వారికి అవగాహన ఇవ్వాలన్న సీఎం. 
  • తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారన్న సీఎం.
  • ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న సీఎం.
  •  
Back to Top