తాడేపల్లి: ప్రభుత్వ ఆదాయ వనరుల పెంపుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో టెండర్ల ద్వారా దక్కించుకున్న బొగ్గు గనుల కార్యకలాపాలపై మరింత ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎ్రరచందనం విక్రయం విషయంలో కేంద్రంతో సంప్రదించి త్వరితగతిన అనుమతులు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎ్రరచందనాన్ని విక్రయించాలని సూచించారు. సిలికా శాండ్ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు.