తాడేపల్లి: యాస్ తుపాను నేపథ్యంలో కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాస్ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు చర్యలపై కలెక్టర్లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. యాస్ తుపానుకు సంబంధించి వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైయస్ జగన్ సూచించారు. కాగా, అతి తీవ్ర తుపాను యాస్ తీరానికి చేరువైంది. కాసేపట్లో ఒడిశాలోని బాలాసోర్ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వివరించింది.