‘స్పందన’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ‘స్పందన’ కార్యక్రమంపై స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. ‌తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సమీక్షించనున్నారు. పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు స్థలాల లేఅవుట్లపై చర్చించనున్నారు. స్కూళ్లు, అంగన్‌వాడీల్లో నాడు–నేడు పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించనున్నారు. అంతేకాకుండా స్పందనకు వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై సీఎం చర్చించనున్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమంపై ప్రగతిని తెలుసుకోనున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై సమీక్షించనున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top