ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పెన్షన్లు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష

 

తాడేపల్లి: ఫిబ్రవరి నుంచి ఆసరా పెన్షన్లు ఇంటి వద్దకే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి∙పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఉపాధి హామీ, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు – నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌ గ్రిడ్‌పై చర్చించారు. ఈ మేరకు సీఎం మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్లను వస్తాయన్నారు. అదే విధంగా అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్ల పట్టాలను నిరాకరించొద్దని ఆదేశించారు.  

కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. వీటి ద్వారా యువతకు మరో 3 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 15971 భర్తీ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

Back to Top