ప్రతి అడుగులోనూ రైతు శ్రేయస్సు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద రైతుల ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ 
 
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

నవరత్నాల్లో తొలి వాగ్ధానం రైతుల గురించే

రైతులకు ఇచ్చిన వాగ్ధానాల అమల్లో భాగంగానే ఆరు లక్షల మందికి పైగా వడ్డీ రాయితీ

ఇప్పటికే వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద దాదాపుగా రూ.1300 కోట్లు ఖర్చు

ప్రపంచంలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు

గత ప్రభుత్వం సున్నా వడ్డీకి సున్నా చుట్టేసింది

రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం

రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరుగుతోంది

వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయం అందిస్తాం

భవిష్యత్‌లో 10 వేల గ్రామాలకు అమూల్‌ పాల వెల్లువ విస్తరణ

మంచి కోసం రైతులు సహకరించాలి

ప్రతి ఒక్కరూ ఈ–క్రాప్‌ నమోదు చేయించుకోవాలి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అడుగులోనూ రైతు శ్రేయస్సే కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  రైతు బిడ్డగా ఈ 22 నెలల పాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు.గత ప్రభుత్వ బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందని గుర్తు చేశారు. పంటకు గిట్టు బాటు ధర రాకుంటే ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఏ మంచి జరగాలన్నా ఈ–క్రాప్‌ మంచిదని రైతులు గుర్తు పెట్టుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. రైతులకు మంచి జరగాలని వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.  2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ అందించింది. ఈ మేరకు సీఎం వైయ‌స్ జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల్లోని రైతులతో మాట్లాడారు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటునే రాష్ట్రం  బాగుంటుంది. రైతు కూలీ బాగుంటాడు. వీరిద్దరు బాగుంటునే 62 శాతం జనాభాకు మంచి చేసిన వారమవుతాం. బాగా బతకడానికి ఒక అవకాశం కల్పించినట్లు అవుతుంది. భూమి మీద నివసిస్తున్న దాదాపు 750 కోట్ల జనాభాలో ఎఫ్‌ఓడీ సర్వే రిపోర్టులు చూస్తుంటే దాదాపు 60 శాతం మనుషులు వ్యవసాయంపై ఆధారపడి బతుకున్నారు. మన దేశం, మన రాష్ట్రమే కాదు..ప్రపంచమంతా ఇదే సిద్ధాంతంపై ఆధారపడ్డారు. 

మన మేనిఫెస్టోలో కూడా నవరత్నాల్లోని మొట్ట మొదటి తొలి వాగ్ధానాలు చూస్తే రైతులే కనిపిస్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి  ఒక్క వాగ్ధానాన్ని మనసా, వాఛ, ఖర్మన ఈ రెండేళ్లల్లో అమలు చేశామని రైతు బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. రైతుకిచ్చిన వాగ్ధానాలు అమలో భాగంగానే 6.28 లక్షల మంది రైతులకు 2019–2020 రబీ రాయితీ కింద వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల రూ.128 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా ఈ రోజు జమ చేస్తున్నాం. 2019–20 లో లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి ఈ పథకం ద్వారా మంచి జరుగుతుంది. 2019 జూన్‌ నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు పంట రుణాలు పొంది తిరిగి చెల్లించిన 61,27,906  మంది రైతులకు ఇప్పటికే రూ.1132 కోట్లు గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మనందరి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేశామని సగర్వంగా చెబుతున్నాను.
ఇప్పటికే ఇచ్చిన రూ.1132 కోట్లు కలిపి దాదాపు 1300 కోట్లు వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకానికి మన ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది. రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో అన్న విషయం గమనిస్తే..సుధీర్ఘంగా సాగిన నా 3468 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకుంటూ, ప్రతి సందర్భంలోను వారికి ఎలా మేలు చేయాలని ఆలోచిస్తూ అడుగులు వేశాను. దానికి నాలుగు కారణాలు చెప్పవచ్చు.

మొట్టమొదటి కారణం పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగితే రైతులకు నష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. రెండోది రైతు పండించిన పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దోచుకునే దళారీ వ్యవస్థ . మూడో కారణం పండించిన ఆ పంటకు కనీస గిట్టుబాటు ధర రాకపోవడం కారణం కావచ్చు. ఇక నాలుగో కారణం ప్రకృతి సహకరించకపోతే పంట నష్టం జరుగుతుంది. వీటిన్నంటిని దృష్టిలో ఉంచుకొని ఈ 22 నెలల్లోనే దేశ చరిత్రలో ఎన్నడా కనీవిని ఎరుగని స్థాయిలో రైతులకు అండగా  నిలవగలిగామని సగర్వంగా చెబుతున్నాను. 

ఒక రైతు బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా రైతులకుతోడుగా నిలబడగలిగాను.
రాష్ట్రంలో ఇవాళ రైతు పక్షపాత ప్రభుత్వం సాగుతోంది. మన ప్రభుత్వం ఈ 22 నెలల్లో వేసిన అడుగులు గమనిస్తే..పైన చెప్పిన నాలుగు కారణాలను పరిగణలోకి తీసుకొని రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాం. మన ప్రతి పథకంలో రైతులను ఎలా ఆదుకోవాలో ఆచరణలో చేసి చూపించాం. 
రాష్ట్రంలో 18.70 వేల పంపు సెట్లు ..9 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశాం. పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా అడుగులు వేశాం. దీనివల్ల ఏడాదికి రూ.8800 కోట్లు భరిస్తూ..ఈ రెండేళ్లలో 17430 కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకడగుడు వేయలేదు. ఫీడర్లకు అధనంగా 1700 కోట్లు వెచ్చించాం. 

ఉచితమైన నాణ్యమైన కరెంటుకు సంబంధించి సగటున రైతు వినియోగించే 7.5 హెచ్‌పీ మోటర్‌ 5 యూనిట్లు కాలుతుంది. నెలకు 1350 యూనిట్లు అవుతుంది. నెలకు రూ.7020 ఖర్చు అవుతుంది. సగటున 200 రోజులు పంపు సెట్లు వాడుతారు. దాదాపుగా ఏడాదికి ఉచిత కరెంటుకు రూ.46 వేల మీ బిడ్డ సంతోషంగా అంగీకరిస్తున్నాడని గర్వంగా చెబుతున్నాను. నాన్నగారు చేసిన దానికన్న నాలుగు అడుగులు వేస్తామన్న మాటకు ఇది నిదర్శనంగా నిలబడిందని గర్వంగా చెబుతున్నాను.

వైయస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో క్రమం తప్పకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు అర హెక్టార్‌ లోపు ఉన్న రైతులు దాదాపుగా 70 శాతం ఉన్నారు. వీరందరికి ఏటా మనం ఇచ్చే రూ.13,500 రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని పంట వేసేటప్పుడు, పంట  కోసేటప్పుడు, సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే రెండేళ్లు ఇచ్చాం. రేపు నెల మే 13న రైతు భరోసా మొదటి విడత కూడా చెల్లిస్తాం. దాదాపు 59 లక్షల మంది రైతులకు రూ.13101 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశామని సంతోషంగా చెబుతున్నాను.

విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు రైతు ఎక్కడా ఇబ్బంది పడకూడదని రాష్ట్రంలో 10601 రైతు భరోసా కేంద్రాలను ఏకంగా మన గ్రామాల్లోనే నెలకొల్పాం. కేవలం ఒక్క రూపాయి రైతు కడితే చాలు రైతులకు ఇన్సూరెన్స్‌ పథకం వర్తించాలి. ఏ ఒక్క రైతు నష్టపోకూడదని ఆర్‌బీకే సెంటర్లలోనే డేటా ఉంచి, రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియమే చెల్లిస్తోంది. ఇప్పటిదాకా 15.67 లక్షల మందికి ఇన్సూరెన్స్‌ సొమ్ము చెల్లించాం.
 
ఏ సీజన్‌లో రైతులకు నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ రావాలి.  అప్పుడే రైతు నష్టపోయిన దానికి కొద్దోగొప్పో న్యాయం జరుగుతుంది. వచ్చే సీజన్‌లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని రైతులకు  ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1055 కోట్లు మనం ఖర్చు చేసి ఇవ్వగలిగామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా. 

గత ప్రభుత్వం సున్నా వడ్డీకి సున్నా చుట్టింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించకుండా బకాయిలు వదిలేసింది. దాదాపుగా రూ. 850 కోట్లు బ్యాంకులు అప్‌లోడ్‌ చేసింది. ప్రతి రూపాయి కూడా రైతులకు మన ప్రభుత్వం చెల్లించింది. ఇది కాక ఈ ఏడాది వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద మొన్న ఖరీఫ్‌లో రూ.289 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు మరో రూ.128 కోట్లు ఇస్తున్నాం. అంతా కలిపి రూ.1300 కోట్లు సున్నా వడ్డీ కింద రైతులకు ఇవ్వగలిగాం.

ప్రకృతి వైఫరిత్యాల సమయంలో రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో ఏర్పాటు చేశాం. ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించాం. కనీక గిట్టుబాటు ధరలు చెల్లించేందుకు ఎంఎస్‌పీ లేని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పించేందుకు రూ.4761 కోట్లు పంట కొనుగోలుకు ఖర్చు చేశాం. అదనంగా ఇది ఖర్చు చేశాం.

గత ప్రభుత్వం నిర్ధాక్షణంగా వదిలేసి వెళ్లిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.324 కోట్లు మన ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది. రైతులకు బోనస్‌గా రూ.300 కోట్లు  శనగ రైతులకు ఇవ్వగలిగాం.

ప్రతి లీటర్‌ పాలకు రైతుకు మంచి జరగాలి. పాదయాత్రలో మినరల్‌ వాటర్‌ చూపించి నీళ్లు, పాల ధర ఒకే రకంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పంటలతో పాటు పాడీ తోడైతేనే మేలు జరుగుతుందని ఏపీ అమూల్‌ పాల వెల్లువ కార్యక్రమం తీసుకువచ్చాం. దాదాపు 674 గ్రామాల్లో ఆమూల్‌ పాలవెల్లువ కార్యక్రమం జరుగుతోంది. దాదాపుగా 10 వేల గ్రామాలకు ఈ పాల వెల్లువ కార్యక్రమాన్ని విస్తరిస్తాం. పాడీ రైతులకు అండగా ఉంటాం. 

జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా 1.20 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా పశువులు పంపిణీ చేస్తున్నాం. వైయస్‌ఆర్‌ జలకళ వంటి పథకాలు అమలు చేస్తున్నాం. అక్వా రైతులకు మంచి చేసేందుకు కరెంటు యూనిట్‌ ధరను రూ.1.50 తగ్గించాం. చివరకు రైతు ఎవరైనా చనిపోతే..ఆ కుటుంబం ఎలా బతుకుతుందని గత ప్రభుత్వం కనీసం ఆలోచన చేయలేదు. అలాంటి కుటుంబాలకు కూడా మన ప్రభుత్వమే సాయం చేసింది. మన ప్రభుత్వం వచ్చిన తరువాత 82 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకున్నాం.

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రైతులకు వివిధ పథకాల ద్వారా  అన్నదాతలకు తోడుగా ఉండేందుకు దాదాపు రూ.65 వేల కోట్లు రైతుల కోసం రైతు పక్షపాత ప్రభుత్వంగా, మీ బిడ్డగా, రైతు బిడ్డగా ఖర్చు చేశాను.

ఒక్క మనవి చేస్తున్నా..రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే సంస్థాగత రుణాలు ప్రతి ఒక్కరికీ అందాలి. రైతులకు సున్నా వడ్డీ అందుబాటులోకి రావాలి. ఇది జరగాలంటే కొన్ని కార్యక్రమాలకు రైతులు సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ–క్రాప్‌ నమోదు చేసుకోవాలి. ఈ–క్రాప్‌ నమోదు చేసుకుంటేనే ఏ పంట ఎవరూ వేశారు. ఎన్ని ఎకరాల్లో వేశారన్న స్పష్టత మనకు ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ, పంట రుణాలు ఇప్పించేందుకు అవసరమవుతుంది. చివరకు రైతుకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఈ–క్రాప్‌ డేటా అవసరం.

 ఆర్‌బీకేలు మీ గ్రామాల్లోనే ఉన్నాయి. ఈ–క్రాప్‌కు దరఖాస్తు చేసుకుంటే వారు పూర్తి చేస్తారు.సున్నా వడ్డీ పథకంలో కూడా 2.70 లక్షల మంది ఈ–క్రాప్‌ డేటాతో ట్యాలీ కావడం లేదు. అయినా కూడా రైతుల విషయంలో ఉదారంగా ఉండేందుకు సున్నా వడ్డీ చెల్లిస్తున్నాం. రైతులందరికీ సున్నా వడ్డీ అందాలి. రైతు వ్యవసాయం కోసం కాకుండా..వేరే అవసరాలకు రుణాలు తెచ్చుకొని పంట రుణాలు అని చెబితే వ్యవసాయరంగంలో నష్టం జరుగుతుంది.

 ప్రతి రైతు కూడా ఇందుకు సహకరించాలి. ప్రతి రైతుకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా..ఈ జూన్‌ నుంచి ఖరీప్‌ ప్రారంభమవుతుంది. ఇకనుంచి ఈ ప్రక్రియలోకి భాగం కావాలి.ఈ–క్రాప్‌ డేటా ఒక ప్రమాణికంగా ఉంటే బాగుంటుంది. ఈ పథకం ద్వారా రైతులకు మరింత మంచి జరగాలని, వచ్చే నెలలో రైతు భరోసా పథకం, ఖరీఫ్‌–2020కు సంబంధించి బీమా సొమ్ము చెల్లిస్తున్నాం. ఈ డబ్బు రైతులకు మరింత ఉపయోగపడుతుందని మనసారా ఆశీస్సు..దేవుడి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు మీ బిడ్డకు కావాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. 
 

 

Back to Top