ఎమ్మిగనూరు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

కాసేపట్లో జగనన్న చేదోడు సాయం విడుదల

కర్నూలు: వరుసగా నాల్గవ ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకున్నారు. ఎమ్మిగనూరు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మిగనూరులో సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. మరికాసేపట్లో జగనన్న చేదోడు పథకం కింద 3,25,020 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.325.02 కోట్లు జమ చేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులైన రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల చొప్పున చేదోడు సాయం అందించనున్నారు. ఈ విడతలో 1,04,551 మంది రజకులకు రూ.104.55 కోట్లు, 1,80,656 మంది టైలర్లకు రూ.180.66 కోట్లు, 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.39.81 కోట్లు జమ చేయనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top