మూలపేట చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

మరికాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు శంకుస్థాపన

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటకు చేరుకున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే మూలపేటకు చేరుకున్నారు. మరికాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేయనున్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు సన్మాన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొంటారు. 
 

Back to Top