కుయుగూరు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అల్లూరి జిల్లా: గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ ప‌రామ‌ర్శ రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అల్లూరి సీతారామ‌రాజు జిల్లా చింతూరు మండ‌లానికి చేరుకున్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా ఉదయం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ నుంచి బ‌య‌ల్దేరిన ముఖ్య‌మంత్రి చింతూరు మండ‌లం కుయుగూరు గ్రామం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా చింతూరులోని కుయుగూరు గ్రామంలో తొలుత పర్యటిస్తారు. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. అనంత‌రం చట్టి గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఏలూరు జిల్లాకు చేరుకుంటారు. వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు. అనంత‌రం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. అనంత‌రం వరద ప్రాంతాల పర్యటన ముగించుకుని.. తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు.

తాజా వీడియోలు

Back to Top