ఢిల్లీ చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఎయిర్‌పోర్టు నుంచి 1-జ‌న్‌ప‌థ్ నివాసానికి బ‌య‌ల్దేరారు. రాత్రి అక్క‌డే బ‌స చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం వైయ‌స్ జగన్ భేటీ కానున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్రధానితో చ‌ర్చించ‌నున్నారు. 

Back to Top