వెలిగొండ ప్రాజెక్టుకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ప్రకాశం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకాశం జిల్లా దోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను సీఎం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌కు  విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, కలెక్టర్‌ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.   మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ ప్రాంగణాలను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.  

తాజా వీడియోలు

Back to Top