వార్షిక బ‌డ్జెట్ ప్ర‌తులు అంద‌జేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి స‌మావేశ‌మై 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను ఆమోదించిన  మంత్రిమండలి. బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌కు అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి బుగ్గ‌న మాట్లాడుతూ.. పేదలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు.

Back to Top