మహిళల క్రికెట్‌ జట్టు వరల్డ్‌కప్‌ సాధించడంపై సీఎం వైయ‌స్ జగన్‌ హర్షం

తాడేపల్లి:  భారత మహిళల అండర్‌-19 క్రికెట్‌ జట్టు టీ 20 వరల్డ్‌కప్‌ సాధించడంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టును సీఎం జగన్‌ అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ విజయాల పరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Back to Top